ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు అర్థం అయినట్టు లేదు.. నరేంద్ర మోడీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తమ మనుగడ కోసం ఎప్పుడు పడవ మునిగి పోతుందోనని భయంతో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డిని మేము కూడా అనవచ్చు… పొట్టోడు, చిటికెన వేలు అంత లేడని.. గతంలో మాట్లాడిన మీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని…
పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు…
నిన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో నేడు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న మోడీ తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రత్యకప్రసారం చూడడానికి క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.. కాంగ్రెస్ వల్లే ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన ఆయన.. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతుందంటూ ఫైర్ అయ్యారు.. భారత్ అంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. ఓ రేంజ్లో కాంగ్రెస్‌పై మాటల దాడికి దిగారు..…
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారం మరోసారి పార్లమెంట్లో కాకరేపింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.. ప్రధానంగా రెండు అంశాలపై మాట్లాడారు…
తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పంజాబ్‌లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి.. మరోసారి పంజాబ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే.. సీఎం అభ్యర్థిని ప్రకటించారు రాహుల్ గాంధీ.. ప్రస్తుతీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపేరునే మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్‌గా ఉన్న నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు బహిరంగంగా అంతా బాగానే…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడిపోయాయి.. హామీ వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు.. గ్యాస్ ధర ఆల్‌టైం హై రికార్డులను తాకిన విషయం తెలిసిందే కాగా.. ఓ వైపు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అనేదానిపై కూడా హామీ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. హరిద్వార్,…
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు.…
త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ…