సీఎం కేసీఆర్‌తో కొట్లాడాలనేదే తన విధానమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పార్టీ అవుతుందనుకుంటే ఇక్కడే ఉంటానని లేదంటే మరో పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరు కొట్లడితే వాళ్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.. ఇక, తనకు బాధ్యత అప్పగిస్తే.. పదిమందిని గెలిపిస్తానని చెప్పారు. అదే సమయంలో నాకు పదవి కూడా అక్కర లేదన్న ఆయన.. పది మందిని గెలిపించూ అని బాధ్యత ఇస్తే గెలిపిస్తా అన్నారు… మరోవైపు, పీసీసీ…
వరుస పరాజయాలు కాంగ్రెస్ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. కాంగ్రెస్ పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం సోనియా గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తుండగా… పార్టీలో సమూల సంస్కరణలు జరగాల్సిందేనని మరో వర్గం వాదిస్తోంది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఏమీ తేల్చలేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా ఉండాలని తాత్కాలికంగా తీర్మానించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మరికొందరు నేతలన్నారు. పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక… మరోసారి CWC మీటింగ్ జరగనుంది. ఇక బుధవారం నాడు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా…
CM KCR Praised CLP Leader Mallu Bhatti Vikramarka at TS Assembly Budget Sessions. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు.. మన బడిపై చేసిన వ్యాఖ్యాలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే యువ నాయకులు సభలో ఉన్నారన్నారు. సభలో చర్చ బాగా జరగాలని,…
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఆ తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వం.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని టార్గెట్ చేశారు.. నన్ను కాంట్రాక్టర్ అని పిలిచినా మంత్రి తెలంగాణ ఉద్యమంలో అయన పాత్ర ఏంటి..? ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాజీనామాకు సిద్ధమయ్యారు సోనియా గాంధీ… సీడబ్ల్యూసీ సమావేశం కోరితే పార్టీ పదవులకు రాజీనామా చేసిందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు సోనియా గాంధీ.. అయితే, సోనియా గాంధీ ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించింది సీడబ్ల్యూసీ సమావేశం. Read Also:…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్ కోల్పోగా.. మిగతా రాష్ట్రాల్లోనూ పెద్దగా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది.. దీంతో ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. ఇదే ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యింది.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన దీదీ.. కాంగ్రెస్ విశ్వనీయతను ప్రశ్నించారు.. అయితే, దీదీపై ఓ రేంజ్లో ఫైర్…
Minister Mallareddy Speaks About BJP and Congress at Telangana Assembly Meetings 2022. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన వ్యాఖ్యాలకు సభంతా నవ్వులమయంగా మారింది. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేము ట్రెండ్ ఫాలో కాము.. ట్రెండ్ సెట్టర్ లం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వెనక్కి తగ్గేదే లేదు.. అక్కడ చంద్రుడు… ఇక్కడ తారక రాముడు.. ఢిల్లీ పెద్దలు రామా అనుకుంటున్నారు అంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు…
5th Day Telangana Assembly Budget Sessions 2022 Updates. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటును ప్రోత్సహించారని ఆయన అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏనాడూ ప్రజా వైద్యాన్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులు పెరిగిపోయాయని, ప్రజలు ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. పేదలు వైద్యంపై అధికంగా ఖర్చు చేసి…