కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్‌రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు తెలిపారు. అంతేకాకుండా కాళేశ్వరం ఆలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.