Telangana CLP Leader Mallu Bhatti Vikramarka Support to AICC President Rahul Gandhi Protest.
పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులపై పెనుభారం పడుతోంది. ఇవే కాకుండా గ్యాస్ ధరలు కూడా పెంచుతూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు, వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు నిన్న రాహుల్‌ను కలిసేందుకు వెళ్లినా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం వెళ్లలేదు.
తాను పాదయాత్రలో ఉన్నందున రాలేకపోతున్నానని ఆయన అధిష్టానానికి వెల్లడించారు. అయితే తాజాగా నేడు రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసనకు భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. చింతకాని మండలం పాతర్ల పాడులో భట్టి విక్రమార్క పాదయాత్రలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి మహిళలు చావు డప్పు మోగించారు.