నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ( శుక్రవారం ) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తుది తీర్పులో కూడా సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ నినాదంతో పదేళ్లుగా కేసీఆర్ దోపిడీ పాలన జరుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ నేత ఆరెంజ్ సునీల్ రెడ్డి స్వాగత సభలో మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు.
మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.