Women and Child Welfare Center Allegations Are Not True Said Mancherial BRS Leaders: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార నేతలు, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ నేతలపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు లేని విమర్శలు చేస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై లేని ఆరోపణలు చేసి ప్రజల దృష్టిలో పలుచన పడ్డారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించి సేవలందిస్తున్న మంచిర్యాల మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం ఏంటని అటు ప్రజలు, ఇటూ ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు కేవలం ప్రతిపక్షాల స్వ‘రక్షణ’ కోసమే అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు విమర్శించే ఏ ఒక్క అంశం లేకపోవడంతో.. ఆసుపత్రులపై లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
‘2018లో మాతా, శిశు ఆసుపత్రిని ప్రారంభించే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడింది. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు నిర్ణయాధికారం లేదు. మంచిర్యాల చుట్టూ, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ స్థలం పరిశీలన చేసినా.. వివాదాలు, కోర్టు కేసులు ఉన్నాయి. దాంతో కలెక్టర్, ఉన్నతాధికారులు కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ కళాశాల దగ్గరలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా తమ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు’ అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.