కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతుంది. మణిపూర్ హింసతో పాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు.
కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాను ఖాళీ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన.
కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా లోక్ సభలో బీఆర్ఎస్ మాట్లాడుతుందని అని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ కూడా ఇచ్చింది.. కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తామని ఆయన వెల్లడించారు.