ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. నేడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రాజ్యసభలో కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు అని కాంగ్రెస్ ప్రచాక కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణమాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi: నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటుకు వచ్చారు. మోడీ ఇంటిపేరు కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వం లాగేసుకున్నారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
కేసీ వేణుగోపాల్ అందరూ కలిసి పని చేసుకోండి అన్నారని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పంచాయతీ పక్కన పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారని, అధికారంలోకి వస్తున్నాం అని చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే.. అహ్మద్ పటేల్ మంత్రి పదవికి కి సిఫారసు చేశారని, నాకు మంత్రి పదవి సోకు లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మంత్రి పదవి ఆశ లేదని, నాకు మంత్రి పదవుల మీద ఆశలు ఉండవని ఆయన అన్నారు. breaking news, latest news,…
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.