ఎన్నికల సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ పై పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ ఆరోపించారు. 2012 జూన్ లో బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖను ఆయన షేర్ చేశారు. రాజ్యాంగ సంస్థల్లో నియామకాలు ద్వైపాక్షిక పద్ధతిలో జరగాలని తాను కూడా చెప్పానని జైరాం రమేష్ గుర్తు చేశారు.
Read Also: Funny Viral Video: బాసూ.. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండాలి! అశ్విన్ కూడా ఏం..
ఎన్నికల సంఘం సభ్యుల నియామకాల్లో ప్రభుత్వానికి మరింత నియంత్రణ ఉండేలా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో క్యాబినెట్ మంత్రిని నియమించే వివాదాస్పద బిల్లును కేంద్రం నిన్న (గురువారం) రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలతో కూడా అద్వానీ ఆ టైంలో ఒక ప్యానెల్ ను ప్రతిపాదించారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Read Also: Parliament: పార్లమెంట్ లో అధిర్ రంజన్ సస్పెన్షన్ పై విపక్షాల ఆందోళన
ప్రస్తుత ప్రతిపాదిత సీఈసీ బిల్లులో 2:1 నిష్పత్తిలో కార్యనిర్వాహక జోక్యం ఉండేలా చూస్తారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఎన్నికల ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది రావడం.. ఎన్నికల కమిషనర్ పై నియంత్రణను మోడీ కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎల్ కే అద్వానీ మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖలోని పలు పేరాలను జైరాం రమేష్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
Read Also: Viral Video: టీచరమ్మ నువ్వు గ్రేట్… ప్రతి ఆడపిల్ల చూడాల్సిన వీడియో!
పారదర్శకత, నిష్పాక్షికత లోపించిందనే అభిప్రాయాన్ని తొలగించడానికి ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థల నియామకాలు ద్వైపాక్షిక ప్రాతిపదికన జరగాలనే అభిప్రాయం దేశంలో పెరుగుతోంది అని జైరాం రమేష్ తెలిపారు. అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈసీ బిల్లు అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగాఉందని ఆయన తెలిపారు. కాగా.. 2023 మార్చి 2వ తేదీన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.