గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల బృందం హింసాత్మక మణిపూర్కు చేరుకుంది. హింసాత్మకంగా దెబ్బతిన్న రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను నేతలు అంచనా వేయనున్నారు.
రాష్ట్రంలో ఉన్న విపత్తుపై రెండు కమిటీలు ఏర్పాటు చేసామని, ఒక కమిటీ అన్నీ ప్రాంతాలతో సమన్వయం చేయడానికి, రెండవది పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించడానికి అని ఆయన అన్నారు. ఈ విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణమని, పంట నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు కూడా చెప్పినా.. ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందన లేదన్నారు కోదండరెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవసాయశాఖా మంత్రికి వినతిపత్రం ఇచ్చామని, రాష్ట్రం అతలాకుతలం అయిందన్నారు కోదండరెడ్డి. breaking news,…
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
"మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి.