Hardik Pandya: విడాకుల తర్వాత కూడా హార్దిక్ ప్రేమ.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్ గిఫ్ట్
- విడాకుల తర్వాత కూడా ప్రేమ
- హార్దిక్ నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్ గిఫ్ట్
- హార్దిక్, నటాశా జులై 2024లో విడాకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఇనీషియల్స్‌ను టాటూగా వేయించుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేను గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ డివోర్స్ తర్వాత కూడా మాజీ భార్య, తన కొడుకు అగస్త్యపై హార్థిక్ తన ప్రేమను కోల్పోలేదు. దీనికి సజీవ సాక్ష్యమే ఈ లగ్జరీ గిఫ్ట్. హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య, మాజీ భార్య నటాశా స్టాంకోవిచ్ కు కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ బహుమతిగా ఇచ్చాడు. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన 5 ఏళ్ల కుమారుడు అగస్త్య పాండ్యాకు భారీ ధరతో కూడిన లగ్జరీ SUVను బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
Also Read:Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
Also Read
ఈ కారు ధర సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ గిఫ్ట్‌ను హార్దిక్ తన మాజీ భార్య నటాశా స్టాంకోవిచ్ కు కూడా అందించినట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ ఈవెంట్ గురించి ముంబైలోని ల్యాండ్ రోవర్ డీలర్ నవనీత్ మోటార్స్ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వీడియోలో చిన్నారి అగస్త్య కారు కీలను అందుకుంటున్నాడు, నటాశా వెనుక నిలబడి ఉంది.
బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ అని, దాని బోల్డ్ లుక్, ఆధునిక ఫీచర్లు, సేఫ్టీతో పాటు రగ్డ్ పెర్ఫార్మెన్స్ దీన్ని ప్రత్యేకం చేస్తాయి. హార్దిక్, నటాశా జులై 2024లో విడాకులు తీసుకున్నప్పటికీ, తమ కుమారుడు అగస్త్య కోసం సరైన కో-పేరెంటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో అగస్త్యతో గడిపే మధుర క్షణాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ హార్దిక్ తన కుటుంబ పట్ల బాధ్యతాభావాన్ని, విడిపోయినా కుమారుడిపై ఉన్న ప్రేమను చూపిస్తుందని అభిమానులు అభినందిస్తున్నారు.
Also Read:Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్‌లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
ఈ ఘటన T20 వరల్డ్ కప్ 2026 సమయంలో జరగడం, హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ పుట్టినరోజు తర్వాత జరగడం వల్ల మరింత చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో “డాడీ గోల్స్ అన్‌లాక్డ్” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ గిఫ్ట్ హార్దిక్ పాండ్యా తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతను మళ్లీ రుజువు చేస్తోంది. అగస్త్యకు ఇలాంటి అద్భుతమైన బహుమతి ఇవ్వడం ద్వారా హార్దిక్ “పాపా జైసా కోయి హార్దిక్ నహీ హై” అనే కామెంట్లు వస్తున్నాయి.
Hardik Pandya gifted a 4 crore worth Black Defender to his son and ex-wife.
Hardik Pandya is truly a gentleman, taking care of his ex-wife Even after the divorce. ❤️ pic.twitter.com/C1G46nrH2S
— Instinct (@Clutchxgod33) February 22, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!