కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు.
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉన్నత స్థాయి ద్రోహిగా అభివర్ణించారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ముక్కోణపు బంధం గురించి మాట్లాడబోతున్నామని బీజేపీ నేత అన్నారు
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందన్నారు. పెద్దపల్లిలో రూ.1500 కోట్ల అభివృద్ధి చేశాం.. ఒక్క ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరికొన్ని నియామకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయన్నారు.
గత ప్రభుత్వం చేయని పనులను మనం చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారిగా రూ. 1035 కోట్ల పనులను మంజూరు చేసుకున్నాం.. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవడానికి కారణం.. ఆరోజు మీరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలవడమే అందుకు కారణం అని చెప్పుకొచ్చారు.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Jupally Krishna Rao: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు.
KTR: ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్ గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది…