Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్‌తో హల్‌చల్
- పాలస్తీనాకు ప్రియాంక మద్దతు
- ప్రత్యేక బ్యాగుతో పార్లమెంట్‌లో హల్‌చల్
- ప్రియాంక తీరును ఖండించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలస్తీనాకు కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ పార్లమెంట్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా అని ముద్రించిన బ్యాగ్‌తో పార్లమెంట్ హాల్‌లో హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ షేర్ చేశారు. ‘‘కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు నిదర్శనం! జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని ఆమెకు స్పష్టంగా తెలుసు.’’ అంటూ షామా మహమ్మద్ పేర్కొన్నారు.
గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు వందిలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ తీరును మొదటి నుంచి ప్రియాంకాగాంధీ వ్యతిరేకిస్తున్నారు. పలుమార్లు ట్విట్టర్ వేదికగా ఇజ్రాయెల్ తీరును ఎండగడుతూ వచ్చారు. తాజాగా పార్లమెంట్ వేదికగా పబ్లిక్‌గా పాలస్తీనాకు సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ప్రియాంక ధరించిన ఈ ప్రత్యేక సంచిపై పుచ్చకాయ, పావురం బొమ్మలు ఉండడం విశేషం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఇటీవల ప్రియాంక.. పాలస్తీనా ఎంబసీని కూడా కలిశారు. అంతేకాకుండా పాలస్తీనా సంప్రదాయక కండువాను కూడా ధరించారు. ఈ సందర్భంగా గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ అనాగరికం.. జాతిహత్యగా పేర్కొన్నారు. ఆలోచనాపరుడైన ప్రతి వ్యక్తి.. ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం.. ఇజ్రాయెల్ తీరును ఖండించాలని ఆమె గతంలో ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
ఇటీవల వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రియాంక భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. తొలి అరంగ్రేటంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అదానీ లంచాల వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. దీంతో ఉభయ సభల్లో కూడా గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం ద్వారా ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. అప్పట్లో ఇది పెను దుమారం రేపింది. తాజాగా ప్రియాంక తీరును బీజేపీ ఖండిస్తుంది.
Smt. @priyankagandhi Ji shows her solidarity with Palestine by carrying a special bag symbolizing her support.
A gesture of compassion, commitment to justice and humanity! She is clear that nobody can violate the Geneva convention pic.twitter.com/2i1XtQRd2T
— Dr. Shama Mohamed (@drshamamohd) December 16, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!