CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత…
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఆల్ రవీందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు మంది కార్పొరేటర్లు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చేలా నలుగురు మహిళా కార్పొరేటర్లకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తరపున బాబా ఫసియుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో మరో కార్పొరేటర్ పత్రాలు సమర్పించారు. మహిళా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇందుకు సంబంధించి తగిన చర్యలు…
Minister Seethakka : తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పెరుగుతుండటం, అనేక మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అనేక మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత…
CM Revavnth Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD)లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.…
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతివిమర్శలు కామన్ గా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతుంటాయి. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటుంటారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎగువ సభలో ప్రసంగించారు. రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో బిజెపి ఎంపి, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్…
CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో కులగణన సర్వేపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, రాజ్యాంగ పరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తుందని…
TPCC Mahesh Goud: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…
MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన హౌసింగ్ బోర్డ్ వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. హౌసింగ్ బోర్డ్ ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించారని తెలిపారు. కానీ, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆ రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపించి, వేలం…
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జాప్యం ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఏడాది గడిచినా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత, బీసీ గణన అశాస్త్రీయంగా నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్…