తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం 2,26,982, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. తలసరి ఆదాయం రూ. లక్ష 74 వేల 172. రూ. 1.8 తలసరి ఆదాయం పెరిగింది. కాగా గత బడ్జెట్.. 2.91 లక్షల…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
Vijayashanti : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, , విజయశాంతి పేర్లు ఖరారు చేయబడ్డాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని తీసుకుని, అధికారికంగా టికెట్లు అందజేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించబడిన తర్వాత, ఈ విషయంపై విజయశాంతి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి తనకు కేటాయించారా లేదా అనే అంశం తనకు తెలియదని, కాంగ్రెస్ అధిష్ఠానం ఏ ఆలోచనలో ఉందో తనకు…
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మామూలుగా అయితే... ఇది రొటిన్ వ్యవహారంలాగే అనిపించేదిగానీ... పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకోవడంతో.... పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్‌లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ.
జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు... ఆ మాటలే వేరుగా ఉంటాయి. ఇంకేముంది... ఇరగదీసేస్తాం... దున్నేస్తాం...మనకడ్డేలేదంటూ మాటలు పేలుతుంటాయి. సరే... చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకన్నది వేరే సంగతి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందని అంటే.... తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు. కానీ... ఆమె రొటీన్‌కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.…