CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం
- వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం
- దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
- రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్‌లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తామని సీఎం తెలిపారు.
Read Also: AICC: మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇక ఆ తర్వాత కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ, మహిళలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పుడు, 43 ఏళ్ల క్రితం అద్దెకు ఉండి చదువుకున్న ఇంటిని సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఇంటి యజమాని పార్వతమ్మను కలుసుకొని ఆమెతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి వనపర్తికి రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామస్తులు, కార్యకర్తలు ఆయన పర్యటనతో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!