కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి, పార్టీ సీఈసీ సభ్యుడు ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండేది. కానీ.. చివరి నిమిషంలో వీరి పర్యటన రద్దయింది. వీరితో ఫోన్ సంభాషణ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. కాగా.. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును పూర్తి చేసే అవకాశం ఉంది.
Read Also: Off The Record: కడప కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది..? వారి ఒతిళ్లతో ఉద్యోగులు బలి?
తెలంగాణ నేతల అభిప్రాయాలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు మీనాక్షి నటరాజన్ అందజేయనున్నారు. ఆ తర్వాత అంతిమంగా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీసీ, ఎస్సీ, మైనారిటీ, మహిళ అభ్యర్దులను ఎంపిక చేసే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ విడతలో అగ్ర కులాలకు అవకాశం లేనట్లేనని సమాచారం.
Read Also: Off The Record: కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టిన ఓ స్కూల్..