GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఆల్ రవీందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు మంది కార్పొరేటర్లు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చేలా నలుగురు మహిళా కార్పొరేటర్లకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తరపున బాబా ఫసియుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో మరో కార్పొరేటర్ పత్రాలు సమర్పించారు. మహిళా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టారు.
Read Also: Falcon Scam Case: ఫాల్కన్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్
ఇది ఇలా ఉండగా మరోవైపు, ఎంఐఎం పార్టీ తరపున కూడా ఎనిమిది నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో నలుగురు మహిళలకు అవకాశం ఇచ్చింది ఎంఐఎం పార్టీ. దింతో ఈ ఎన్నికలు ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారాయి. ఇక బీజేపీ మాత్రం ఈ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది. కార్పొరేటర్ల సంఖ్య బలం తక్కువుగా ఉండడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ విషయంపై తర్జన భర్జన పడుతోంది.
Read Also: Minister Seethakka: కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్