CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత చైతన్యవంతం చేయడానికీ అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కులగణన చేపట్టడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా , ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నదనే సంకేతాన్ని మరింత బలంగా చాటడానికి, ఈ భేటీ ద్వారా నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలను, సంస్కరణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం కీలకంగా నిలవనుంది.
Off The Record: కేసీఆర్ నోట ఉపఎన్నికల మాట.. అక్కడ బైపోల్స్ తప్పవా..?