రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్…
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి…
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ ఓయూ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది. రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం నిరాకరించింది.…
కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ లాంటిది, అక్కడ ఎవడి ఆట వాడు ప్రాక్టీస్ చేసుకుంటారు.. ప్రత్యర్థి ఎదురైనప్పుడు అంతా కలిసి ఆడతారు అని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత, బీజేపీ విధానాలు ఇలా అన్నింటిని ఎండగట్టారు.. ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై స్పందిస్తూ.. పై వ్యాఖ్యు చేశారు.. ఇక, కేసీఆర్‌కు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించిన రేవంత్ రెడ్డి.. నిజాం…
రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎక్కడైనా తిరగవచ్చునని, పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ ముఖ్యమన్నారు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. అయితే కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదు నాకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్, బీజేపీ గురించే మాట్లాడుతానని.. కానీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియదన్నారు. ఈ మధ్య టీవీలు చూడటం మానేశానన్న జగ్గారెడ్డి.. అందుకే ఏం జరుగుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లాలో టీపీసీసీ రేవంత్…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారానికి తెరపడింది… కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి, పార్టీ అధినేత్రి నుంచి సానుకూలత వ్యక్తం అయినా.. చివరకు పార్టీలోకి రావాలంటూ పీకేను సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు పీకే.. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతో, గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న…
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది. మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని వైసీపీ…
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ…
గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఇటీవల పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా విజయబావుటా ఎగురవేయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్డిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ లాంటి పార్టీలో హార్డిక్ పటేల్ వంటి నేతలు ఉండకూడదని గుజరాత్ ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు…