కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ, దాని న్యాయ బృందం (లీగల్ టీమ్)కు పెద్ద దెబ్బ. విజయవంతమైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అనేక న్యాయ పోరాటాలలో గత ముప్పయ్ ఏళ్లుగా ఆయన పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుప్రీంకోర్టులో చురుకైన పాత్ర పోషించారు. పౌరసత్వ(సవరణ) చట్టం, గోప్యత హక్కు, మరాఠా కోటా, జహంగీర్‌పురి కూల్చివేత వంటి…
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ…
లక్ష్మా పూర్ గ్రామంలో రచ్చబండ ప్రారంభం అయింది.రైతు రచ్చబండలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ ఊరు నుండే ధరణి పోర్టల్ ప్రారంభించారు..కానీ ఈ ఊర్లోనే భూముల రికార్డ్ సక్కగా లేదు. ఈ గ్రామంలో రైతు బందు..రైతు బీమా అందటం లేదు. పిల్లల పెళ్లి లకు అమ్ముకుందాం అంటే అమ్ముకునే పరిస్థితి లేదు. మంత్రి మల్లారెడ్డి అచ్చోసిన ఆంబోతు లెక్క తయారయ్యాడు. మైసమ్మ కు వదిలేసిన దున్నపోతు లెక్క తయార్ అయ్యాడు. ధరణిని అడ్డం పెట్టుకొని…
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలలోకి తట్టాబుట్టా సర్దేశారు. ఎట్టకేలకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిలుపు అందింది. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత…
వరుస పరాజయాలు, షాక్‌లతో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే జరగుతున్నాయి.. సుదీర్ఘ సమావేశాలు, కీలక సమాలోచనలతో ముందుకు సాగుతున్నారు.. ఈ సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు.. చాలా కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్న గుజరాత్ హార్దిక్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్న శైలజానాథ్ అంత యాక్టివ్‌గా లేకపోవడం, గతంలో ఏపీసీసీ చీఫ్‌గా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు…
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్కు హాజరు కానున్నారు. కాగా ఉదయ్ పూర్లో ఎటు…
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ తులసిరెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అని అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అంటూ మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి…
ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్…
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు రెండింతలు అయ్యాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహూల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. 2014లో 14.2 కిలోల…