వరుస పరాజయాలు, షాక్‌లతో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే జరగుతున్నాయి.. సుదీర్ఘ సమావేశాలు, కీలక సమాలోచనలతో ముందుకు సాగుతున్నారు.. ఈ సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు.. చాలా కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్న గుజరాత్ హార్దిక్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు హార్దిక్ పటేల్.
Read Also: Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..!
తన రాజీనామాపై సోషల్ మీడియాలో స్పందించిన హార్దిక్ పటేల్.. నేను కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.. ఇక, నా నిర్ణయాన్ని నా సహచరులు మరియు గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానని పేర్కొన్న హార్దిక్ పటేల్.. నేను భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నానంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా, గత కొంత కాలంగా హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌ను వీడుతారంటూ ప్రచారం సాగుతూ వచ్చింది.. వాటిని ఖండిస్తూ వచ్చిన ఆయన.. ఇవన్నీ వదంతులేనని తెలిపారు. వీటిని ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదంటూ కొట్టిపారేశారు.. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడం చర్చగా మారింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిన హార్దిక్ పటేల్ ఎన్నో నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఇక, 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.