KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్…
Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో…
Megastar Chiranjeevi: గాంధీ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అహింస, సత్యం, సరళమైన ఆలోచనల శక్తి వంటి పదాలకు మహాత్మాగాంధీ గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో కొనియాడారు. గాంధీజీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచిపోతాయని.. ఆయన ఆదర్శాలు అన్నింటినీ జయిస్తాయని చిరు పేర్కొన్నారు. కాగా చిరంజీవి ఇంకా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు కూడా జారీ చేసింది.…
Shashi Tharoor Comments on Mallikarjun kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేక రాజకీయ పరిణామాాల మధ్య అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక ఏకభిప్రాయంతో కావాలని.. ఈ విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు శశిథరూర్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పలు…
Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ…
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు.
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు.…
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక…