గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై టీపిసిసి అధ్యక్షులు పొన్నాల ఫైర్ అయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని ఎన్నికల సిబ్బంది నిరాకరించింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కొమ్మూరి ప్రతాప్ కు ఓటు ఇవ్వడంపై రగడ మొదలైంది. శ్రీనివాస్ రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య గట్టి పోటీ నెలకొననున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో బళ్లారిలో రాహుల్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.
Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు…
Break for Bharat Jodo Yatra on October 17: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్…
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే విజయవాడలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందన్నారు. తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని.. సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని.. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా…
నేడు ఏఐసీసీ అద్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు రానున్నారు. ఈనేపథ్యంలో.. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆయన మధ్యాహ్నం గాంధీభవన్లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు...
Raghuveera Reddy: ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తన యథాస్థితి కొనసాగుతుందన్నారు. అయితే అనంతపురం జిల్లాలో త్వరలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని రఘువీరారెడ్డి తెలిపారు. భారత్ జోడో…