Mahesh Kumar Goud: పాకిస్తాన్ తరహాలోనే.. టీఆర్ఎస్ నేతలు భారత్ మ్యాప్‌లో అది లేపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud Fires On TRS Leaders Over Flexis: టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ ప్రకటన తర్వాత కూడా హైదరాబాద్‌లో టీఆరెస్ ప్లేక్సిలే కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన.. ఆ ప్లేక్సిలో భారత్ మ్యాప్ వేశారని, అందులో జమ్ముకశ్మీర్ మ్యాప్ లేపేశారని అన్నారు. భారత్ మ్యాప్‌లో నుంచి జమ్ముకశ్మీర్‌ని లేకుండా పెట్టడం బాధాకరమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మన భారత మ్యాప్‌పై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. పాకిస్తాన్ కూడా కశ్మీర్ లేకుండా మ్యాప్ చూపిస్తుందని, అదే తరహాలో టీఆర్ఎస్ నేతలు కశ్మీర్ లేకుండా తమ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ వేశారని, ఇది దేశద్రోహమే అవుతుందని అన్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. అంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్ తమతో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేతలు సైతం టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్‌కు 70 స్థానాలు రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తమ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగరేస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం గంజాయి స్టేట్‌గా, డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రం బాగు పడుతుందని, బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!