Megastar Chiranjeevi: గాంధీ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అహింస, సత్యం, సరళమైన ఆలోచనల శక్తి వంటి పదాలకు మహాత్మాగాంధీ గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో కొనియాడారు. గాంధీజీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచిపోతాయని.. ఆయన ఆదర్శాలు అన్నింటినీ జయిస్తాయని చిరు పేర్కొన్నారు. కాగా చిరంజీవి ఇంకా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు కూడా జారీ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. దీంతో చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన అభిమానులు భావిస్తున్నారు. అటు గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్‌లతో చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు.
Mahatma Gandhi will remain the most telling example of the Power of simplicity and simple ideas of Non-violence and Truth. His ideals will remain relevant and all conquering, forever.
Happy #GandhiJayanti pic.twitter.com/j7oIDruYFN
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2022
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గాడ్ ఫాదర్ మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. అందరూ తనను హాలీవుడ్ సినిమాలు చేయాలని అడుగుతున్నారని, కానీ తాను దక్షిణాది సినిమాలు చేయాలని కోరుకుంటానని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. బాలీవుడ్ స్టార్లు, దక్షిణాది స్టార్లు కలిసి సినిమాలు చేస్తే బాక్సాఫీసు వద్ద ప్రభంజనమే అని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి అభిమానులు తన అభిమానులుగా మారిపోతారని.. అలాగే తన అభిమానులు చిరంజీవిని అభిమానించడం ప్రారంభిస్తారని సల్మాన్ వ్యాఖ్యానించాడు.