Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో మమేకం అవుతున్నారు.
Read Also: Adipurush Teaser Review: మీసాల రాముడితో `ఆదిపురుష్`
ఇదిలా ఉంటే గురువారం( అక్టోబర్6) నుంచి కర్ణాటకలో ‘ భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఆ తరువాత రోజు నుంచి ప్రియాంకాగాంధీ కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నారు. భారత్ జోడో యాత్రం ప్రారంభంలో వైద్యం కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత సోనియాగాంధీ కర్ణాటక మాండ్యా జిల్లాలో గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. కర్ణాటకలో యాత్రలో పాల్గొనే ముందు రెండు రోజు ఆమె కూర్గ్ లో ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ యాత్రం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3750 కిలోమీటర్లు సాగనుంది. దాదాపుగా 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగియనుంది. తమిళనాడు, కేరళలో ముగిసిన భారత్ జోడో యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. 21 రోజుల పాటతు 511 కిలోమీటర్ల మేర కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.