Revanth Reddy: వినాశకాలే విపరీత బుద్ధి.. కేసీఆర్ కుట్ర చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Sensational Comments On KCR After BRS Announce: దసరా సందర్భంగా జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడం ఓ దుర్మార్గపు ఆలోచన అని విమర్శించిన ఆయన.. కేసీఆర్‌కు తెలంగాణలో పోటీ చేయడానికి అర్హత లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు ఋణం తీరిపోయిందని.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. 2001 నుండి 2022 వరకు కేసీఆర్ ఆర్ధికంగా బలోపేతమయ్యారని పేర్కొన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ కొత్త పార్టీ తెచ్చారన్న ఆయన.. రేపు ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని.. కేవలం కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే ఆయన జాతీయ పార్టీ పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ’ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆ పదాన్ని పూర్తిగా చంపేయాలనుకుంటున్నారని తూర్పారపట్టారు. అయితే.. తెలంగాణ ప్రజల జీవనంలో ‘తెలంగాణ’ అనే పదం ఓ భాగమని, తెలంగాణ హంతకుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరో 12 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.
Also Read
ఇదిలావుండగా.. నవంబర్‌లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల్ని ఆకర్షించేందుకు తమదైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మరోవైపు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో.. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ప్రకటన చేశారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!