34 ఏళ్ల నాటి రోడ్డు రేస్ కేసులో పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్యజోత్ సింగ్ సిద్దూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆయన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేరారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్‌కి పోలీసులు తరలించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్దూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Destination…
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో…
ఇందిరా, పీవీలు ప్రధానిగా ఉన్నప్పుడు పేదలకు భూములు ఇచ్చారని జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాగీర్ దార్ల వద్ద 45 ఎకరాల కంటే ఎక్కువగా ఉండొద్దని చట్టం ఉందని, గతంలో.. 48 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారన్నారు. అంతేకాకుండా ఆ భూమిని.. కేవలం వ్యవసాయం చేసుకోవాలి, అమ్ముకోడానికి వీలులేదని క్లాజ్ పెట్టారన్నారు. అంత సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. వైఎస్సార్ కూడా తన తండ్రి…
ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్…
ఎర్రబెల్లి, గంగుల, తలసాని, దానం లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన చేరారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అలాంటి వాళ్ళను కేసీఆర్‌ను పోగుడతున్నరని, 8 ఏండ్లుకు నోటిఫికేషన్లు నిన్న వచ్చాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంకు అప్పులు… కేసీఆర్ గొప్పలు.. జనంకు తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని, 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని,…
ఆంధ్రా రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి తీరు హాట్ టాపిక్ అవుతుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల సర్వేలతో ఆయన కాకరేపారు. ఆయన భాష్యాలు, సర్వేలు తప్పవడంతో ఆయన బొక్కబోర్లా పడ్డారు. తాజాగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ఎంపీ లగడపాటి. తాజాగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో లగడపాటి సమావేశం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శని, ఆదివారాల్లో బిజీగా గడిపారు లగడపాటి. పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంతో…
మరోసారి టీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్‌ఎస్ హౌలే…
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ? కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై…
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని స్పూర్తి స్థల్‌లో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసి మెలిసి జైపాల్ రెడ్డి పని చేశారని, జైపాల్ రెడ్డి లేకపోవడంతో దేశానికి చాలా లోటని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని ఆయన…
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రచ్చబండ కార్యక్రమం ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్నారని ఆయన బైకాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు…