కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రంతో వరదలు భీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటను కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు పడినప్పటికీ .. రాష్ట్రంలో పెద్దగా పంటనష్టం జరుగలేదని , పంట నష్టం జరిగినట్లు తనకు సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్వీటర్ వేదికగా..విమర్శల…
enior Congress leader Anand Sharma scotched speculation about his meeting with BJP president JP Nadda on Thursday, saying if he had to, he would do so openly as they both are from Himachal Pradesh and studied at the same university.
నేడు విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. కాగా.. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము…
తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు…
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్‌తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా.…