మరోసారి టీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు.
కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్‌ఎస్ హౌలే గాండ్లు అంతా ఢిల్లీ పోయి డ్రామాలు వేశారని ఆయన ధ్వజమెత్తారు. ధాన్యం కొనడం మానేసి డ్రామాలు వేశారని, తమ్ముడు తారక రామారావు… సోదరి కవిత పట్టు చీర కట్టుకుని ధర్నా చేశారన్నారు. రాహుల్ గాంధీతో యూనివర్సిటీలకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటామన్నారు.