KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
- రోడ్డు సేఫ్టీ సెస్ పేదలు-మధ్యతరగతిపై భారంలా
- కొత్త వాహనాలకు రూ.2 వేల నుంచి రూ.10 వేల సెస్
- ప్రజలపై అదనపు ఛార్జీలు అన్న ఆరోపణ
- "బజెట్ లో నిధులు కేటాయించకపోవడం తప్పా, ప్రజల జేబులు కొట్టకండి" కేటీఆర్ డిమాండ్
- సుప్రీంకోర్టు సూచనలు vs. ప్రభుత్వ విధానం.. రోడ్డు భద్రతా నిధి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ముఖ్యమంత్రి యొక్క ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, వాటిని అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారి భద్రత ప్రమాణాలను పెంచకుండా, అమాయక ప్రజలపై రూ.270 కోట్ల అదనపు భారం మోపాలని చూడటం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
Also Read
- Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
- BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
హైడ్రా వంటి విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనంపై రూ.2 నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు. కష్టపడి కూడబెట్టుకుని లేదా అప్పు చేసి వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.
Ranchi: హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!