కేంద్ర మంత్రి బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్రం నిధులు ఇచ్చింది.. అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు ఇచ్చింది.. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.. కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది.. అరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వరిధాన్యంకి బోనస్ ఇస్తానని సన్నధాన్యంకే బోనస్ ఇస్తుంది.. పద్దెనిమిది నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు.
Also Read:Peddapalli: ఫేస్ బుక్ పరిచయం.. ప్రేమగా మారి.. ఇంట్లో కలిసి ఉండగా..
ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ ల కేసులు పత్తా లేకుండా పొయాయి.. మూటలు తీసుకెళ్ళి ఢిల్లీకి కప్పం కడుతున్నారని తెలిపారు.. రాజన్న కోడెల మరణాల విషయంపై మాట్లాడుతూ.. కోడెలని రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానందే.. కోడెలని రక్షించడానికి సరైనా ప్రణాళికలు రూపోందించాలి.. కోడెలు ఉంచే గదుల సంఖ్యలని పెంచాలని సూచించారు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులని కించపరిచే విధంగా ఉంది.. అర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు.. పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజులలోనే ఉగ్రవాదులని చంపాం.. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది.. అపరేషన్ సింధూర్ కొనసాగుతుంది.. పీవోకే ని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు.
Also Read:Aditi Bhavaraju : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సింగర్ అదితి భావరాజు..
కవిత లెటర్ పై చర్చ కాంగ్రెస్ డ్రామా.. బీఅర్ఎస్, బిజేపి పార్టీలో కలవదు.. కవిత అరెస్టుని అపడానికి బిజేపి తో కలవాలని చూసినప్పుడే దగ్గరికి రానివ్వలేదు.. కాంగ్రెస్ డైరెక్షన్ లో జరిగినదే కవిత లేఖ.. బీఅర్ఎస్ అవినీతి పార్టీ.. కుటుంబ పార్టీ మేము దగ్గరికి రానివ్వము.. కాంగ్రెస్, బిఅర్ఎస్ అడ్టుకున్నా బిజేపి ప్రస్థానం అగదు.. అందరికి అధికారం ఇచ్చాం.. బిజేపికి అవకాశం ఇద్దాం, అధికారం ఇద్దామన్న ఆలోచనలో తెలంగాణ సమాజం ఉంది.. కల్వకుంట్ల ఆర్ట్ ప్రోడక్షన్ లో తెలంగాణ చార్ పత్తా సినిమా నడుస్తుంది.. కవిత, కేటిఆర్, సంతోష్ , హరిష్ రావులు చార్ పత్తా అయితే కెసిఅర్ జోకర్ అని ఎద్దేవా చేశారు.