కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..
V. Srinivas Goud: రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తమకు అండగా ఉన్నారు అనే ధైర్యం మళ్ళీ ప్రజల్లో కలుగుతోంది.. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాదిగా రేపు వరంగల్ సభకు తరలి రానున్నారు.
ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు .. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన వారికి విరామం మాత్రమే కానీ విశ్రాంతి కాదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది.
CPI MLA Kunamneni: తెలగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా బాగా నిర్వహించారు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాలకు నేను లేకపోయినా.. నాకు చాలా మంది ప్రజాప్రతినిధులు చెప్పారు.. అసలు మాట్లాడించేవారు కాదని.. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే మార్షల్స్ కి పని చెప్పే వారని విన్నాను.. ఇక, బడ్జెట్ లో సామాన్యులకు ఏ ప్రభుత్వం న్యాయం చెయ్యడం లేదు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ-2025 బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.
ఇష్టారాజ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
Asha Workers: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆశా వర్కర్లు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.