Harish Rao: కాళేశ్వరంపై ఇంకో కుట్ర.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు
- కాళేశ్వరంపై ఇంకో కుట్ర
- మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగునీటిపై హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతుంది.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తుంది.. నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు.. వారం రోజుల కిందట ఇదే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాను.. మోటర్లు ఆన్ చేయమంటే పట్టించుకోలేదు..
Also Read: CM Chandrababu: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చ!
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ కి నీళ్ల విలువ తెలియదు.. మీరు వ్యవసాయం చేయలేదు కాబట్టి మీకు నీటి విలువ తెలియదు.. నేరపూరిత నిర్లక్ష్యం వల్ల వర్షాలు వస్తున్నా చెరువులు, డ్యామ్ లు నింపటం లేదు.. BRS పార్టి, కేసీఆర్, హరీష్ రావుపై ఉన్న కోపం రైతులపై చూపించవద్దు.. మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని కిందికి వదలొద్దు.. కాళేశ్వరం ప్రాజెక్టు పై BRS పై నిందలు మోపడనికే ఇలా చేస్తుంది.. కాళేశ్వరం కూలింది అన్న విషయాన్ని నమ్మించడానికి ఇలా చేస్తున్నారు.. మళ్ళీ కాళేశ్వరం నుంచి నీరు పంపింగ్ చేస్తే కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం బయటపడుతుందని దుర్మార్గం చేస్తుంది.. ప్రభుత్వం నడపడం మీకు చేతకావడం లేదా? అని ప్రశ్నించారు.
Also Read:Naresh : పాన్ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్..
కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు అన్ని నింపితే పంటలు పండుతాయి కదా.. రోజుకు 2 టీఎంసీ ల నీరు మిడ్ మానేరుకు పంపింగ్ చేయొచ్చు.. 7 మోటర్ల నుంచి నీళ్లు పంపింగ్ చేసే అవకాశం ఉన్న 3 మోటర్లు మాత్రమే పంపింగ్ చేస్తున్నారు.. అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం నీళ్ళతో నిండేవి.. రైతులకు యూరియా ఇవ్వక, ప్రాజెక్టులు నింపక అరిగోస పెడుతున్నారు.. రోజుకు ప్రాజెక్టుల్లో 42 లక్షల మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.. మీరు కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయకపోతే మేము లక్షలాది మంది రైతులతో వెళ్లి మోటర్లు ఆన్ చేస్తాం.. నీళ్లను సముద్రం పాలు చేస్తామంటే మేము చూస్తూ ఉరుకోము.. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది..
Also Read:Bogatha Waterfall: నేటి నుంచి బొగత జలపాతం సందర్శన నిలిపివేత.. జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం
కాళేశ్వరం పై ఇంకొక కుట్ర జరుగుతుంది.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు.. రోజు ఇలా చేస్తే మోటర్లు పాడవుతాయని BHEL హెచ్చరించింది.. అయినా కావాలనే ఇలా కుట్రలు చేస్తున్నారు.. ఉత్తమ్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కానీ మోటర్లు ఆన్ చేయకపోతే పెద్ద ఎత్తున వెళ్లి మోటర్లు ఆన్ చేస్తాం.. నల్గొండలో మాధవరెడ్డి ప్రాజెక్టుపై కూడా ఇలానే చేస్తున్నారు.. 18 ఏళ్ల తర్వాత కృష్ణా నదిలో నీళ్లు వచ్చాయి.. అయినా ఇప్పటివరకు ఏ ఒక్క చెరువు కూడా నింపలేదు.. కల్వకుర్తి ప్రాజెక్టులో మూడు మోటర్లతో పంపింగ్ చేయాల్సి ఉంటే ఒకటే మోటార్ ఆన్ చేశారు.. వరంగల్ జిల్లాలో దేవాదుల విషయంలోనూ ఇలానే చేస్తున్నారు.. కమీషన్లు, పర్సెంటేజీల కోసమే మీకు సమయం సరిపోతుందా అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!