VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
- ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
- రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాల పరిష్కారం..
- ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంది: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar: హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల టీజీఎస్ఆర్టీసీ కళా భవన్‌లో రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్పేర్ బోర్డు సభ్యులతో ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సమావేశమైంది. ఈ మీటింగ్ కు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన వెల్పేర్ బోర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు.
Read Also: Monsoon: జూన్‌లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు: ఐఎండీ..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ఇక, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. విధి నిర్వహణలో మరణించిన 2,350 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామన్నారు. మెడికల్ అన్ ఫిట్ అయిన మరో 537 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Read Also: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?
అయితే, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఉద్యోగికి టెస్టులు చేశామని టీజీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య టెస్టుల ఫలితంగా 726 మంది ఉద్యోగులకు, 184 మంది ఉద్యోగుల జీవిత భాగస్వామ్యులను ప్రాణాప్రాయం నుంచి సంస్థ కాపాడిందన్నారు. అలాగే, మహాలక్ష్మి పథకం అమలుతో సిబ్బందిలో పెరిగిన పని భారాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపడుతుంటే.. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీలో 3036 రెగ్యూలర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని.. సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఆ నియమాకాలు కచ్చితంగా జరుగుతాయి.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తమ మనుగడ కోసం ఐదారు నెలలుగా కొందరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా.. ఉద్యోగులు ఎంతో సమయమనంతో ఉన్నారని వీసీ సజ్జనార్ చెప్పారు.
Read Also: Ghaziabad: ఈ పిల్లలున్నారే.. కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరకు
అలాగే, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వీసీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలే ఉంటాయో తప్ప.. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవన్నారు. ప్రతి నిర్ణయం చాలా పారదర్శకంగా, సంస్థ నియమ నిబంధనలకు లోబడే ఉంటుంది.. యాజమాన్యానికి, సిబ్బందికి వెల్పేర్ బోర్డు సభ్యులు అనుసంధానకర్తల్లాగా పని చేయాలని సూచించారు. ప్రతి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలి అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!