UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
Yogi Adityanath: మహా కుంభమేళా ముగింపుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. తాజాగా, మహా కుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అని ఆయన అన్నారు. ‘‘రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించింది. అయితే మంచి వ్యక్తులకు సంబంధాల అందమైన చిత్రం లభించింది. వ్యాపారులకు వ్యాపారం లభించింది. భక్తులకు శుభ్రమైన…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు.
Sambhal violence: గతేడాది నవంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ పట్టణలో అల్లర్లు చెలరేగాయి. ఈ అలర్లకు కేరాఫ్‌గా ‘‘షాహీ జామా మసీదు’’ మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద…
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఆయన త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ సూర్యుడికి ‘‘అర్ఘ్యం’’ సమర్పించారు.
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
MU: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ‘‘అసభ్యకరమై వ్యాఖ్యలు’’ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU) గెస్ట్ లెక్చరర్‌ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జనవరి 11 రాత్రి అతడికి, ఏఎంయూ భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనబడింది. ఈ సంఘటనపై ఏఎంయూ అధికారులు సంస్కృత విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అరిమందన్ సింగ్ పాల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
గుడి-మసీదు వివాదంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసంలో శివలింగం ఉందని, అక్కడ కూడా తవ్వకాలు జరపాలన్నారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంభాల్ సహా పలు జిల్లాల్లో జరుగుతున్న తవ్వకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు.