Sambhal violence: గతేడాది నవంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ పట్టణలో అల్లర్లు చెలరేగాయి. ఈ అలర్లకు కేరాఫ్‌గా ‘‘షాహీ జామా మసీదు’’ మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌లో ఉన్నవారిలో కొందరు జైలులో ఉండగా, మరికొందర్ని పోలీసులు గుర్తించారు. హింసకు సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యయాయి. వీటి ఆధారంగా సంభాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జిషీట్ సమర్పించింది. హింసకు సంబంధించి మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఈ మొత్తం అల్లర్ల కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహ్మాన్ బార్క్ ప్రాన నిందితుడివగా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కొడుకు సోహల్ ఇక్బాల్‌తో పాటు మరో ఆరుగురు కీలకంగా ఉన్నారు. వీరే అధికారుపై హింసకు ప్రేరేపించారని, అశాంతిని రెచ్చగొట్టారని, జనాన్ని సమీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఇప్పటి వరకు 80 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ప్రభుత్వం న్యాయవాది రాహుల్ దీక్షిత్ తెలిపారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..
నవంబర్ 24 హింసకు నిందితులు ఎలా కుట్ర పన్నారనే వివరాలను పోలీసులు చార్జిషీట్‌లో పొందుపరిచారు. గత నెలలో, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముల్లా అఫ్రోజ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు పాకిస్తాన్ నిఘా సంస్థ, ISI తో సంబంధం ఉన్న ముఠాలో సభ్యుడని తేలింది. ఈ కేసులో పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఢిల్లీ సీలంపూర్‌లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి, సంభాల్ తీసుకువచ్చారు.
షాహీ జామా మసీదుని, ప్రాచీన హిందూ ఆలయం హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వే చేయాలని కోర్టు ఆదేశించడంతో నవంబర్ 24న అధికారులు మసీదు సర్వేకి వెళ్లే సమయంలో స్థానిక ముస్లిం గుంపు అధికారులపై దాడికి తెగబడింది. రాళ్లతో దాడులు చేశారు. అధికారుల విధులను అడ్డగించారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు స్థానిక నివాసాలను ధ్వంసం చేశారు. అల్లరి మూకల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.