బహ్రైచ్ ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పెద్ద ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తున్నారని అన్నారు. నాక్ డౌన్ విధానం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం హర్యానాలోని పంచకులలో ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.
Bahraich Violence : రెండు రోజుల హింసాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో శాంతి నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
Maulana Shahabuddin: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్రమోడీ దేశంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్‌కి తెలుసు’’ అని అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి కొంతకాలంగా కట్టుకున్న రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టారు. సంప్రదాయ చికిత్సతో ఓ వైద్యుడు తన చేతికి కట్టు కట్టారని సీఎం యోగి అన్నారు. కొన్నిసార్లు సంప్రదాయ చికిత్సలను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారన్నారు. వాస్తవానికి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం తన మణికట్టుకు రిస్ట్ బ్యాండ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించి సీఎం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా…
Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు.