గత అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…
అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో రంగంలోకి దిగింది సీబీఐ.. నరేంద్ర గిరి అనుమానాస్పద మరణంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా.. ఇక, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో.. రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ.. యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.. ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా,…
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి…
జనాభాలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. క్రమంగా జనాభా పెరిగిపోతూనే ఉంది… కొన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలంటే.. సంతానాన్ని కూడా అర్హతగా పెట్టారు.. తాజాగా, జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. త్వరలోనే కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే ముసాయిదాను తయారు చేశారు.. దాని ప్రకారం.. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు సంతానంగా ఉన్నవారు ప్రభుత్వ…