గుడి-మసీదు వివాదంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసంలో శివలింగం ఉందని, అక్కడ కూడా తవ్వకాలు జరపాలన్నారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంభాల్ సహా పలు జిల్లాల్లో జరుగుతున్న తవ్వకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. “తవ్వకాలు జరుపుతున్నందున నాకొక విషయం గుర్తుకు వస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలో వద్ద కూడా శివలింగం ఉండేది. అక్కడ కూడా తవ్వకాలు జరపాలి. మనమందరం అక్కడ తవ్వకాలకు సిద్ధం కావాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: Safest SVUs: ADAS ఫీచర్‌తో సురక్షితమైన SUV కారులు ఇవే..
కాగా.. రాష్ట్రంలోని సంభాల్‌లో గత కొద్ది రోజుల ముందు తవ్వకాలు జరిగాయి. ఇటీవల అక్కడ మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు. సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్‌లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. ఈ అంశంపై తాజాగా స్పందించిన అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యానాథ్ పై వ్యంగ్యంగా స్పందించారు.
READ MORE: Nitish Kumar Reddy: పవన్ కళ్యాణ్.. “నారాజు గాకుర మా అన్నయా…” పాట పాడిన నితీష్ రెడ్డి(వీడియో)
ఇదిలా ఉండగా.. “యూపీ ప్రభుత్వం ఓ ఆంగ్ల దినపత్రికకు ప్రకటన ఇచ్చింది. అందులో యూపీని ఆర్థిక వ్యవస్థలో పవర్ హౌస్‌గా అభివర్ణించారు. ఎంటర్‌ప్రైజ్ స్టేట్‌ను రూపొందించడానికి ప్రభుత్వం వద్ద భూమి లేదు. 2027 నాటికి ఎంటర్‌ప్రైజ్ స్టేట్‌ను ఏర్పాటు చేయాలనే చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద అవగాహన ఒప్పందాలు జరిగాయి. వాటిలో సీడీఆర్ నిష్పత్తి మాత్రం పెరగడం లేదు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తారు. అప్పులు చేసి వెళతారు.” అని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.