బీఆర్కే భవన్ లో సీఈఓని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనం తో కూడిన సెలువు ప్రకటించాలని వెంకట్ కోరారు.
జగన్నాథ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మరియు మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని” తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో…
రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణం.. రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు మోడీ అన్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారన్నారు. మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి…
భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత.. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రం ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. లేదంటే రచ్చ రంబోలానే.. గతంలో అత్త, భర్త హవా నడిచేది. భర్త, అత్త కూర్చోమంటే కూర్చునేవారు.. నిలబడమంటే నిలబడేవారు.. అలా హుకుం జారీ చూస్తూ వారి పెత్తనాలు సాగుతుండేవి. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేదండోయ్. అత్త, భర్త ప్రవర్తన,…
ఈరోజు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర…
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హాట్ కామెంట్స్ చేశారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని బండి సంజయ్…
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు.
డోన్లో ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు నంద్యాల జిల్లా డోన్లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన…అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు. విధ్వంస పాలనకు, అభివృద్ధికి ఈ ఎన్నికలు సవాల్ అంటూ ఆయన పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.…