CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు.
CM Revanth Reddy: పది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా 'హైడ్రా' పేరు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపతూ ముందుకు సాగతుంది.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Balka Suman: తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ చేపట్టారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని., ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందని., ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడని., రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర…
ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్‌లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం పారిస్‌లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్‌లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్‌లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె…
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
Hyderabad Metro: హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. పాలమూరు- రంగారెడ్డి తప్పా.. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.