CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే…
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని Analog AI కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణను భవిష్యత్ నగరాల దిశగా తీసుకెళ్లడానికి చేపడుతున్న ఏఐ సిటీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి కార్యక్రమాల్లో తర్వాతి తరం ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ సిస్టమ్‌లను ఎలా అనుసంధానించొచ్చన్నది ఈ సమావేశంలో చర్చించారు. Maoist Leader Hidma: పువర్తిలో…
CM Revanth: వరంగల్ జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 15) సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒకటి గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం ఆయన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమం వడ్డేపల్లి PGR గార్డెన్ లో జరగనుండగా, సీఎం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు ఈ కార్యక్రమంలో…
CM Revanth: భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తొలి పునాది రాయి వేసిన సీఎం సభావేదిక పై పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని.. చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రేవంత్‌కు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి.. దాచిపెడితే దాగవు.. కుతుబ్ షాహీలు నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని…
చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారు.. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోంది.. ఈ కార్యక్రమం…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మేడారంలో ఆలయ…
CM Revanth: నేడు మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించ నిర్వహించనున్నారు. గిరిజన సంప్రదాయాలకు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు సమాచారం. మహాజాతర నాటికి ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Uttat pradesh: చిన్న కొడుకుతో కలిసి మరిదిని పొట్టు పొట్టు కొట్టిన వదిన మధ్యాహ్నం 12 గంటలకు…
మాజీ డీఎస్పీ నళిని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని ఇష్యూ పై స్పందించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నళిని ఇంటికి పంపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిశారు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నళినిని కలెక్టర్ కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా..ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ ఆమెకు…
అస్సాంలో భారీ భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు! అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది.…