డోన్‌లో ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నంద్యాల జిల్లా డోన్‌లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన…అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు. విధ్వంస పాలనకు, అభివృద్ధికి ఈ ఎన్నికలు సవాల్ అంటూ ఆయన పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేస్తున్నారని.. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి కాలం చెల్లిపోయిందని.. డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. పాలన అంటే బుగ్గన హరికథలు చెప్పడం కాదన్నారు. రాయలసీమకు ఏమి చేసాడని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు.
నన్ను ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలతో పొత్తు అవసరమా..?
వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో తాను ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పొన్నూరు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుడింగివి అయితే, బచ్చా అంటున్న నన్ను ఎదుర్కోవడానికి నీకు ఇన్ని పార్టీలతో పొత్తులు కావాలా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఇలాంటి ఒక కార్యక్రమమైన ఎందుకు చేయలేకపోయావు. లంచాలు లేని వివక్షలేని సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పేద కుటుంబానికి నేను అందించాను. నేను బచ్చానైతే ,నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు..? నువ్వు 14 ఏళ్లలో ఏమి చేయకపోగా, నన్ను బచ్చా అంటూ మాట్లాడుతున్న, చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలి. 130 సార్లు బటన్ నొక్కి 2, లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేశాను. రెండు లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో మెజారిటీ నా ఎస్సీలు, నా ఎస్టీ లు , నా బీసీలు, నా మైనార్టీలు ఉద్యోగాలు చేస్తున్నారు. 200 స్థానాలకు గాను 50 శాతం సీట్లు నా ఎస్టీలకు, నా ఎస్సీల కు ,నా బీసీలకు నా మైనార్టీలకు ఇచ్చాను. ఇదంతా చేసిన నన్ను, చంద్రబాబు బచ్చా అంటున్నాడు.”
లైట్ బీర్లు దొరకడం లేదని పాదయాత్ర.. అధికారులకు ఫిర్యాదు
మద్యం ప్రియులు బ్రాండ్‌ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ప్రజల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదని.. జిల్లాలోని వైన్స్ , బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ వస్తే బీసీగణన పథకాలు వస్తాయి..
మొయినాబాద్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జి. రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయి.. కాంగ్రెస్ వస్తే బీసీగణన పథకాలు వస్తాయని తెలిపారు. ఇదే విషయాన్ని మొన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే.. బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై ఈటల కామెంట్స్
మల్కాజ్‌గిరి ప్రజల మనస్సులో ఉన్నమాటల్నే మాజీ మంత్రి మల్లారెడ్డి నాతో చెప్పారు. రెండు లక్షల పై చిలుకు ఓట్లతో మీరు గెలవబోతున్నాంటూ అనేక మంది ఇప్పటికే నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. మల్లారెడ్డి తన మనస్సులో మాటలు దాచుకోలేక నాతో అన్నా నీవే గెలవబోతున్నావంటూ ముందస్తుగా చెప్పారంతే. ఇంతమంది ఓబీసీ మంత్రులు గత కేంద్ర ప్రభుత్వాలలో ఎన్నడూ లేరు. 12 మంది దళిత మంత్రులు ఉన్నారు. 8 మంది ట్రైబల్ మినిష్టర్లు ఉన్నారు. 5 మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఒక మహిళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీపై ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయి. మరో సారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కల వచ్చిందా. అనేక స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గుల్ల చేసి, ఇలాంటి పిచ్చి ప్రకటనలు, వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు.
దేశం బాగుండాలంటే కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం
మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారాలమ్మ కు.. రామప్ప రామలింగేశ్వర స్వామి వార్లకు నమస్కారించి స్పీచ్ ప్రారంభించిన నడ్డా మాట్లాడుతూ.. ఇంత ఎండలో కూడా మీరు ఈ సభకు తరలి వచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే వినోద రావు , సీతారాం నాయక్ కు గొప్ప విజయం చేకూరుతుందని ఆశిస్తున్నానన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం బాగుండాలంటే కేవలం బిజెపి వల్ల మాత్రమే సాధ్యమని, ముఖ్యంగా ఈరోజు దేశం లో శక్తి వంతమైన నాయకుడు మోడీ, ఈ ఎన్నికల్లో మీ ముందు కు వచ్చే మా అభ్యర్థులను మీరు ఆశీర్వదించాలన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించింది మీరు కళ్ళారా చూశారని, ఒక శక్తి వంత మైన ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలను కాకుండ బలమైన బిజెపి లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు జేపీ నడ్డా. ముఖ్యంగా గిరిజనుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఆర్థికంగా భారత దేశం బలపడుతుంది, భారత దేశాన్ని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీది అని, దేశం లోనే పేదరిక నిర్మూలన కోసం గత 10సంవత్సరాలనుండి పాటు పడుతుంది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు.
జగన్ ను తొలగించాలని చంద్రబాబు కుట్ర
జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని నెల్లూర లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబు ఒక విషయం చెప్పారు. జగన్ ను ఇక్కడి నుంచి లేపేస్తే ఏం చేసుకుంటాడని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబులో మానవత్వం లేదు.. మనిషి కాదు. ఒక క్రూరుడు ఒక మృగం లాంటివాడు. గతంలో తల్లి తండ్రిని విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. జగన్ కు ఏ ఆపద జరిగినా. ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు ఉండడానికి అనర్హుడు. ప్రజలు ఉరితీస్తారని తెలియచేస్తున్నా. చంద్రబాబు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య చేయమైన వంగవీటి రంగాను హత్య చేయించారు. ఐ.ఏ.ఎస్.అధికారి రాఘవేంద్ర రావు.. చెరుకూరి నారాయణ రెడ్డి లను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు. కారంచేడు..గంగ పర్రుల లో దళితులను ఊచ కోత కోయించిన వ్యక్తి చంద్రబాబు.”
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ భద్రతకు ప్రమాదం
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ భద్రతకు ప్రమాదమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీ ఒక జోకర్ లెక్క ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శాంతియుత వాతావరణం చెడ గొట్టాలని చూశారు… ఘర్షణలు జరగాలని అనుకున్నారని, ఒక సీఎం, ఒక మాజీ సిఎం బాగా దొరికారన్నారు కిషన్ రెడ్డి. సీఎం పేగులు మెడలో వేసుకుంటా అంటాడు… మాజీ సిఎం కళ్ళు పీకి గోళీలు ఆదుకుంటాడు అట.. వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ఆయన మండిపడ్డారు. బీర్ బ్రాండ్ చక్రం తిప్పుతావ ఢిల్లీకి వచ్చి అంటూ కిషన్ రెడ్డి హెద్దెవ చేశారు. గెలిచిన వారికి నిలుపుకో చేతకావడం లేదు కానీ డిల్లి కి వచ్చి చక్రం తిప్పుతాడు అట.. అక్షింతలు విషయం లో హిందూ మనోభావాలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రోజుల తరబడి వేల కోట్లు ఖర్చు పెట్టీ యాగాలు చేశారు ఎందుకు చేశారు మరి అని, రెండు పార్టీలు తమ స్వార్థం కోసం పనిచేస్తున్నాయన్నారు.
ఎన్నికల స్టంట్‌లో భాగమే నోటీసులు
కేసీఆర్ ఎండలకు ఆగం ఆగం చేస్తుండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇచ్చి బీజేపీ ఆగం ఆగం ఐతున్నారని, నిన్నటి నుండి బీజేపీ వాళ్ళకు నిద్ర లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ల రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అవసరమా అనే చర్చ బీజేపీ నేతలు చేశారని, ఇది వాస్తవమే కదా అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లు పై తెలంగాణ లో వ్యతిరేకత వచ్చిందని, రేవంత్ కి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారన్నారు. బీజేపీకి ఎన్నికల్లో దెబ్బ పడుతుంది అని..నోటీసులు ఇచ్చిందని, కాంగ్రెస్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకూలం కాబట్టి బీజేపీ కి భయం పట్టుకుందన్నారు జగ్గారెడ్డి. ఎన్నికల స్టంట్ లో భాగమే నోటీసులు అని ఆయన విమర్శించారు. లీగల్ గా ఫైట్ చేస్తామని, కేంద్రం లో హంగ్ లేదు…బొంగు లేదని ఆయన అన్నారు.
బీజేపీ గత పదేళ్లుగా దేశాన్ని దోపిడీ చేస్తోంది
అందరినీ కలుపుకొని పోయేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం లో సమన్వయ కమిటీ వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయి కమిటీ లు వేస్తున్నామన్నారు. దేశంలో గత పది ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న బిజెపి దేశాన్ని దోపిడీ చేసిందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని , అస్తులని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వవల్సిన అవసరం వుందన్నారు. జనాభా దామాషా పద్ధతి లో వనరుల పంపిణీ కావాల్సి వుందని, కాపిటలిస్ట్ లకు బిజెపి దోచి పెడుతోందన్నారు. వనరులను కేసీఆర్ దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విచ్ఛిన్నం చేసిందన్నారు. కరెంట్ పోకపోయిన కరెంట్ పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ దిగజారి ప్రచారం చేస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. గ్గులేకుండా రాష్ట్రం లో తిరుగుతున్నారని, రాజకీయ చైతన్యం తెలంగాణ లో వుందన్నారు.
ఐదేళ్ల పాలన చూసి మళ్లీ గెలిపించమని అడుగుతున్నాం..
జగన్ సంభాషణ చూస్తే రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చారని.. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసేసరికి భావోద్వేగానికి గురయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది యాక్షన్ కాదు, ఆటోమేటిక్‌గా వచ్చింది.. దానికి సమాధానం చెప్పలేనన్నారు. జగన్‌కు అందరూ ఒక్కటేనని.. వైసీపీలో చేరినప్పుడే నన్ను నమ్మిన వారి కోసం రెండు మెట్లు దిగి ఇదే సరైన పార్టీ అని చెప్పానన్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలపై నమ్మకంతోనే మార్పులు చేయలేదన్నారు. జగన్ అందరి మాటలు వింటారని.. ఏది ప్రయోజనకరమో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జగన్ అందరి మాటలు వింటారు.. ప్రజలకు ఉపయోగపడేదే చేస్తారన్నారు. 2004 నుంచే మా కుటుంబంలోని వారు పదవుల్లో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉంటే తప్పన్నారు. 1999లోనే తాను ఎంపీని అయ్యానన్నారు. ప్రజలు ఆమోదించేవారికే సీట్లు ఇస్తారన్నారు.