CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్న సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్నారు.
Read also: TGSRTC MD Sajjanar: స్కూల్, కాలేజీ అమ్మాయిలే వాళ్ల టార్గెట్.. సజ్జనార్ ట్వీట్ వైరల్
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునివ్వడం మరింత గందరగోళానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
MMTS: ప్రజలకు ఎంఎంటీఎస్ గుడ్ న్యూస్.. 17, 18 తేదీల్లో రాత్రి కూడ ప్రత్యేక రైళ్లు