కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ.. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా..? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా..? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్‌లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు.
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే... నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ASK KTR' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.
కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు.
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
దసరా ఉత్సవాలకు రెండు రోజుల ముందుగా అక్టోబర్ 9న ఇటీవల నిర్వహించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్షలో అర్హత సాధించిన 11,063 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన 1,635 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లను ఆదివారం పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 659 మంది అసిస్టెంట్…