CM Revanth Reddy: పది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపతూ ముందుకు సాగతుంది.. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవరినీ వదలకుండా అక్రమ కట్టడాలను నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. హైదరాబాద్‌లో ముంపునకు గురవుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేసి శాశ్వత పరిష్కారం చూపేందుకే `హైడ్రా` ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ కొందరు హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Read also: Mallu Bhatti Vikramarka: మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం..
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని అమాయకులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు బాధితులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి వసూళ్లకు పాల్పడేవారిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. అవినీతి కట్టడాలకు హైడ్రా తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు. హైడ్రా పేరు చెప్పి అవినీతి, డబ్బులు డిమాండ్ లకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి పెద్ద స్థాయిలో వున్న అధికారులైనా సరే ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వారిని గుర్తించి తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.
CM Revanth Reddy Brother: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు..