సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. గత సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ నెలలో సమ్మెకు దిగారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న తమరు వారికి సంఘీభావం తెలిపి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా…
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు.
మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. రేపు వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024ను పార్లమెంట్ లభించింది. అయితే, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై విస్తృత అధ్యయనం కోసం జేపీసీని ఏర్పాటు…
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెషల్ సినిమా షోస్‌కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచబోమని ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్.రామ్ ప్రసాద్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ…
Uppal Fly Over: హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్‌లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం…
నేడు రోజ్‌గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్‌గార్ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం…
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేస్తూ.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.