Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ కూడా రైతు భరోసా ఇస్తాం
- కేసీఆర్ కూడా రైతు భరోసా ఇస్తాం
- పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీ అప్‌డేట్ చేస్తున్నామన్నారు. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు ఏ టెక్నాలజీ వచ్చినా.. వెంటనే వరంగల్‌కు కూడా టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పారు. వరంగల్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని.. భద్రకాళి ట్యాంక్‌బండ్, టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లు..
ఉమ్మడి ఏపీలో 25 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్ల 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో ఇస్తామని ప్రకటించారు. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజల దగ్గరకే ప్రభుత్వా్న్ని పంపిస్తామని చెప్పారు. దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని… వాటిని స్క్రూటినీ చేసి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ అని.. లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతేకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తి చేసి అందిస్తామని ప్రకటించారు.
Also Read
రైతు భరోసా…
వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించాక రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని.. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రకటించారు. భూమిలేని అర్హులైన పేదలకు ఏటా రూ. 12 వేలు సాయం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ 200 ఎకరాలు సాగు చేస్తే…ఆయనకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో మర్చిపోయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయన్నారు. పేదోడి సొమ్ము విదేశాలకు పంపించిన అక్రమార్కుడిని చట్ట ప్రకారం కేసులు పెడితే ప్రతిపక్షాలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నాయని.. ప్రతిపక్షాల చిల్లర మాటలకు తమ పనులే సమాధానం చెబుతాయని పొంగులేటి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!